జనం సాక్షి , ముప్కాల్ జులై 4 గత 2013 నుంచి మోడల్ స్కూల్లో అవర్ లీ బేసిస్ లో పనిచేస్తున్న అనేకమంది టీచర్లకు బదిలీల ద్వారా ఏర్పడే ఖాళీలలో తిరిగి వారిని నియమించాలని కోరుతూ డి ఈ ఓ కు మరియు ఎంఈఓ కు వినతి పత్రాన్ని అందించారు 2013 నుంచి మోడల్ స్కూల్ లలో అవర్ లీ బేసిస్ లో పనిచేస్తున్న 128 మంది టీచర్లు ప్రస్తుతం జరిగే బదిలీల ద్వారా తమ ఉద్యోగాన్ని కోల్పోతున్నారు ఇన్నేళ్ల నుంచి మోడల్ స్కూల్ వ్యవస్థను కాపాడుతూ వచ్చిన మమ్మల్ని వదిలేయకుండా తిరిగి ఏర్పడే ఖాళీ లో మమ్మల్ని నియమించాలని కోరుతూ టీచర్లు వినతిపత్రాన్ని సమర్పించారు ప్రభుత్వం తమపై దయ తలచి వేతనాన్ని మంజూరు చేసి ఆ ఉద్యోగాల్లో మమ్మల్ని నియమించాలని కోరుతున్నారు
మోడల్ స్కూల్ టీచర్ (హెచ్ బి టి) లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.




