సీఎంకు సీఎల్పీ అభినందనలు
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తికావడం పై కాంగ్రెస్ శాసన సభాపక్షం సీఎంకు అభినందనలు తెలిపింది. రైతులకు వడ్డీలేని రుణాలు, రాజీవ్ యువకిరణాలు, రుపాయికే కిలో బియ్యం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కిరణ్ సమర్ధంగా అమలు చేశారని ఆ పార్టీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ప్రశంసించారు. రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి 2014లోనూ కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.



