Wednesday, 4 November 2026

సీఎం కప్ 2023 బంగారు పథకం సాధించిన యాదాద్రి భువనగిరి వాసులు

జనం సాక్షి జూన్13(భువనగిరి రూరల్ )తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు AK ప్యాలెస్ భువనగిరిలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో మే 28 నుండి 31 వరకు హైదరాబాదులో జరిగిన CM కప్ 2023 లో బంగారు పతకం సాధించి మొదటి స్థానంలో నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా ఖో -ఖో జట్టు సభ్యులను అలాగే కోచ్ నాతి కృష్ణమూర్తి గారిని పైళ్ల శేఖర్రెడ్డిఎమ్మెల్యేఘనంగా
సన్మానించారు.జిల్లా పేరును ముందు వరసలో ఉంచినక్రీడాకారులను అభినందించారు. అలాగేఅనాజీపూర్ గ్రామపంచాయతీ తరఫున 50,000 వేల రూపాయల నగదు బహుమతిని సర్పంచ్ ఎదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేతులమీదుగా క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్CEO కృష్ణారెడ్డి,మహిళా శిశు సంక్షేమ అధికారిని స్వరాజ్యం, DYSO ధనుంజయులు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు జడల అమరేందర్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు,భువనగిరి MPP నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, MPDO నరేందర్ రెడ్డి భువనగిరి ZPTC సుబ్బూరు బీరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు