Wednesday, 4 November 2026

సీఎం కేసీఆర్ కు చెప్పి మాకు ఉద్యోగాలు ఇప్పించాలిఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్ల  వినతి సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా… ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హామీ

 

 

 

 

జనం సాక్షి(హుజురాబాద్):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చారు.. సీఎం కేసీఆర్ దృష్టికి మా సమస్యను తీసుకొని వెళ్లి ఉద్యోగాలు ఇప్పించేలా కృషి చేయాలని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్లు వినతిపత్రం అందజేశారు. బుధవారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీఎస్సీ 98 క్వాలిఫై టీచర్ల సంఘం నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా వారు 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ ప్రకటించగా అందులో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగాలు అప్పటి ప్రభుత్వం అధికారులు ఇవ్వకుండా నాన్ లోకల్ వారికి ఉద్యోగాలు ఇచ్చారని దానివల్ల చాలామంది లోకల్ నిరుద్యోగులు నష్టపోయారని ఈ విషయంపై కోర్టుకు వెళ్లగా కోర్టు సైతం క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పునిచ్చిందని అన్నారు. ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డిలకు విన్నవించినప్పటికీ వారు స్పందించలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండ పర్యటన సందర్భంగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసినప్పుడు క్వాలిఫై టీచర్లకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని ప్రగతి భవన్ కు పిలిపించుకొని తమ సమస్యలు సీఎం కేసీఆర్ సావధానంగా విన్నారని అన్నారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రాలోని డీఎస్సీ 98 క్వాలిఫై టీచర్లకు ఉద్యోగాలు ఇస్తూ జీవో జారీ చేసిందని ఎంటీఎస్ పద్ధతి కింద అక్కడి క్వాలిఫై టీచర్లకు ఉద్యోగ అవకాశం కల్పించిందని అన్నారు. డీఎస్సీ 98 లో నాన్ లోకల్ వారు ఎక్కువగా ఉద్యోగాలు పొందడం వల్ల తెలంగాణ జిల్లాల్లోని అప్పటి నిరుద్యోగులు నష్టపోగా తెలంగాణ డీఎస్సీ 98 క్వాలిఫై టీచర్లు పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందని అన్నారు. కాగా తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు ఉద్యోగాలు పెంచాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వివరించారు. వారి సమస్యను విన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తప్పకుండా తెలంగాణ ప్రాంత డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్ల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ళ విజయ ఉమ్మడి జిల్లా డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్ల సంఘం అధ్యక్షులు పిట్టల సంజీవ్, ఎంబడి శంకర్,పాడి విజయపాల్ రెడ్డి,దోమల చంద్రమౌళి,మాడిశెట్టి వీరన్న,శ్రీనివాస్ రెడ్డి,మంచి కట్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.