Wednesday, 4 November 2026

రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర 3వ మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

 

 

 

 

 

కొడకండ్ల, ఏప్రిల్ 18 (జనం సాక్షి ) జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం నందు రజక సంఘం అధ్యక్షుడు సట్టు సోమయ్య అధ్యక్షతన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదునూరి మదార్, జిల్లా నాయకులు లొంక ఐలయ్య ఈ సందర్భంగా మూడవ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రజక వృత్తిదారుల సంఘం ఏర్పడి 23 సంవత్సరాలు గడిచిందని ఎన్నో పోరాటాలు అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలు  సాధించడం జరిగిందని, మూడవ రాష్ట్ర మహాసభ వీరనారి ఐలమ్మ ఉద్యమించిన గడ్డలో జరగడం ఈ మహాసభలకు స్పూర్తినిస్తుందని తెలిపారు. ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేయనున్నట్టు వాటి సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాలు జరిపి రజకుల యొక్క హక్కుల కోసం పోరాడుతామని అన్నారు. మన పోరాటం వల్లనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రజకులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు, మోడ్రన్ దోబిగాట్లు, ఐలమ్మ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారని తెలిపారు.  మూడవ రాష్ట్ర మహాసభ ఏప్రిల్ 29, 30 తేదీలలో జనగామ వైష్ణవి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్నాయని,  ఈ సభలకు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రజక వృత్తిదారులు హాజరవుతారని తెలిపారు. అనంతరం కొడకండ్ల రజక సంఘం ప్రధాన కార్యదర్శి(జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్) దూదిగాని నాగరాజు, జిల్లా నాయకులు దూదిగాని లింగయ్య మాట్లాడుతూ రజకులకు రక్షణ చట్టాలు చేయాలని,50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఫింక్షన్ మంజూరు చేయాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడిన మాకు నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని,పది లక్షల రూపాయల తో రజక బందు ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాడూరి రాములు,మోడపల్లి సోమన్న,రాపోలు రాములు, కొండ్రాతి ఉపేందర్, రెడ్డిరాజుల గురువయ్య,కాంబోజి ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.