జహీరాబాద్.ఫిబ్రవరి 8( జనం సాక్షి ) ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయింపు చేస్తూ అసెంబ్లీ లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టినoదుకు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఐకేపీ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఆయా మండలాలకు చెందిన సెర్ప్ ఐకేపీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మా సెర్ప్ ఉద్యోగుల కు ప్రభుత్వ ఉద్యోగుల లాగా పే స్కేల్ వర్తింప చేస్తున్నందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా రాష్ట్ర సెర్ప్ జె ఏసీ పిలుపు మేరకు పాలాభిషకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో డిపిఎం మల్లేశం,, జహీరాబాద్ ఝరాసంగం కోహిర్ రాయికోడ్, న్యాలకల్ మొగుడం పల్లి , మండలాల ఏపీఎం శివకుమార్, బాల కృష్ణ, సమ్మయ్య, నర్సిములు, కుమార్ ఉద్యోగులు మోహన్ తుక్కమ్మ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.




