Wednesday, 4 November 2026

పరిపాలన సౌలభ్యం కోసమే నూతన భవనాల ఏర్పాటు.

 

 

 

 

 

అభివృద్ధికి సహకరించండి…మరింతగా అభివృద్ధి చేద్దాం.మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు.షాద్ నగర్ మున్సిపాలిటీ:ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే నూతన భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. సుమారు 6 కోట్ల నిధులతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ తో కలసి బుధవారం ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, మెరుగైన పాలన అందించడం కోసమే నూతన భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నూతన భవనాలను నిర్మించడం కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.షాద్నగర్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలంటే అందరం కలిసి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్లు,జెడ్పిటిసిలు, ఎంపీపీ లు, బీఆర్ ఎస్ నాయకులు, మండలాల అధ్యక్షులు,మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…