Tuesday, 3 November 2026

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి లకు పాలాభిషేకం.

దౌల్తాబాద్ జూన్ 26, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండలపరిధిలో ఇందుప్రియాల్ గ్రామంలో రెండో విడత దళిత బంధు విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.పిఎసిఎస్ చైర్మన్ వెంక రెడ్డి , ఎంపీటీసీ మల్లేశం, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వేంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్ల చొప్పున విడుదల చేసిన సందర్భంగా దౌల్తాబాద్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సంబగ యాదగిరి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సంక్షేమ పథకం తేలేదు. దళిత బంధు పథకం దేశంలో ఏ రాష్ట్రం కూడా లేనటువంటి గొప్ప పథకం అంబేద్కర్ ఆశయ సాధనలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకొని దళితుల జీవితాల్లో వెలుగు నింపాలని గొప్ప ఆశయంతో ఇంత పెద్ద సాహసం చేయడం చాలా గొప్ప విషయం, దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడతాం అనగానే ప్రతిపక్ష పార్టీలు ఇద్దేవ చేశాయి కానీ మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇచ్చినటువంటి ఘనత అది కేసిఆర్ కే దక్కుతుంది అన్నారు. రెండో విడతలు భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100యూనిట్లు విడుదల చేశారు. ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిది ఇటువంటి గొప్ప ఆశయంతో ముందుకు పోతున్న కేసిఆర్ కు మనం ఎల్లప్పుడూ అండగా ఉండాలని లేని పక్షంలో మన అభివృద్ధి ఆగిపోవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బైండ్ల యాదగిరి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షాదుల్లా, పాఠశాలల చైర్మేన్లు, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ వివిధ కమిటీల ప్రెసిడెంట్లు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.