హుజూర్ నగర్ జూన్ 26 (జనం సాక్షి): జులై ఒకటో తేదీన కోదాడ జరిగే బీసీ సంక్షేమ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు బీసీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం హుజూర్ నగర్ లో జరిగిన బీసీ సంక్షేమసంఘం పట్టణ, మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బందు పథకంలో కొన్ని కులాల వారికి మాత్రమే ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని, కానీ అనేక కులాల వారిని పక్కన పెట్టడం సమంజసంగా లేదన్నారు. దారిద్రరేఖకు దిగువన జీవిస్తూ చేతివృత్తులను నమ్ముకుని దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారికిచ్చే రుణ సౌకర్యంలో కూడా రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాగా అర్హులైన పేదలందరికీ రుణ సహకారం కల్పించాలని, బీఆర్ఎస్ పార్టీకే ప్రాధాన్యత కల్పించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. త్వరలో చేపట్టుతున్న గృహలక్ష్మి పథకంలో కూడా జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇళ్లను కేటాయించాలన్నారు. జులై ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు కోదాడ పెరిక హాస్టల్లో జరిగే సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి హాజరు అవుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాస్ , హుజూర్నగర్ పట్టణ అధ్యక్షులు బొడ్డు గోవిందరావు, మండల అధ్యక్షులు గడ్డం అంజి యాదవ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గూడెపు దీప, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు చేపూరి నరసింహ చారి, మహిళా నాయకులు చీకూరి లీలావతి, గౌరవ అధ్యక్షులు కోలపాటి వెంకటేశ్వర్లు, కొట్టు శేఖర్, నరేష్, సింహాద్రి , అమరయ్య, ముషం సత్యనారాయణ, శిరం శెట్టి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి




