Tuesday, 3 November 2026

సీఎం పదవి కోసం కాదు : జానారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం పదవి కోసం తాను సభ పెట్టడం లేదని మంత్రి జానారెడ్డి స్పష్టం చేసింది. పదవుల కోసం సభలు పెడుతున్నారనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానానికి తెలిపేందుకే ఈ నెల 30న సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించే వరకూ పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. తమ ప్రయత్నాలకు డెడ్‌లైన్లు లేవు అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర సాధనకు ఎన్నో ఏళ్లు పట్టింది అని తెలిపారు. తెలంగాణ కూడా అంతే అని పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల్లోనూ 2014 లోనూ కాంగ్రెస్‌దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *