హైదరాబాద్ : ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించిందని, తెలుగువారి కోసం ఢిల్లీలో కట్టిందే ఏపీ భవన్ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులు నరకం అనుభవించారని తెలిపారు. చార్‌ధామ్ యాత్రికుల అనుభవాలు తనను చాలా బాధించాయన్నారు. వారిని ఏపీ భవన్ బయట టెంటు వేసి ఉంచడం దారుణమన్నారు. ఉత్తరాఖండ్ సీఎం బహుగుణను కలిసి బాధితుల సమస్యలు వివరించానని చంద్రబాబు చెప్పారు. మానవతా దృక్పథంతోనే బాధితులను అదుకునే ప్రయత్నం చేశానని చంద్రబాబు చెప్పారు. అన్ని రాష్ట్రాలు బృందాలు ఏర్పాటు చేసి తమ వారిని సురక్షితంగా తీసుకెళ్లాయని అయన తెలిపారు.




