Thursday, 5 November 2026

సీఎం పర్యటన సందర్బంగా ముందస్తు అరెస్టు.

బెల్లంపల్లి, జూన్ 9, (జనంసాక్షి )
ముఖ్యమంత్రి కెసిఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో శుక్రవారం పోలీసులు ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పీ, వామ పక్ష పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న నాయకులను సైతం వదలకుండా అరెస్టు చేశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఈసందర్భంగా అరెస్టు కాబడిన నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్బంగా ముందస్తు అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టు చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు అయిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నాయకులు ఉన్నారు.