Thursday, 5 November 2026

బడి మనదే – బాధ్యతా మనదే TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి

బచ్చన్నపేట (జనం సాక్షి)ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ద్వారా మాత్రమే అందరికి నాణ్యమైన విద్య అందుతుందని,విద్య,వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారుTSUTF జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బచ్చన్నపేటమండల కేంద్రంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమ సమావేశం మండల అధ్యక్షులు కృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగింది ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న చావా రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి
ఖాళీలను భర్తీచేయ్యడంతో పాటు మౌలిక వసతులకు ఉద్దేశించిన మన ఊరు మన బడి ని అన్ని పాఠశాలలకు విస్తరింపచేయాలని ,పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు ,ప్రభుత్వం విద్య,వైద్యాన్ని ఉచితంగా నాణ్యంగా అందించినప్పుడు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుఅవుతాయని అన్నారు ,ప్రభుత్వపాఠశాలల బలోపేతం కోసం ఒక,సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయ సంఘంగా TSUTF పనిచేస్తుందని ,దానిలో భాగంగానే స్వచ్చందంగా TSUTF బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందని ,సమాజ భాగస్వామ్యం కూడా అవసరమని ,అందరూ ప్రభుత్వ పాఠశాలలు నిలబడడానికి కృషిచేయాలని కోరారు .జిల్లా పరిషద్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను దూరం చేసుకోవడం వల్ల విలువైన విజ్ఞానాన్ని కోల్పోతామని ,సుశిక్తులైన ,అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని ,తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లల భవిష్యత్తుకొరకు చేర్పించాలని కోరారుమండలంలోని గోపాల్ నగర్,నక్కవానిగూడెం,ఇటికాలపల్లి,రామచంద్ర పురం,కొన్నే,పడమటి కేశ్వాపూర్ తో నాగిరెడ్డిపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ,ఈ కార్యక్రమంలో TSUTF రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ ,జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు,కోశాధికారి సుధాకర్ ,జిల్లా కార్యదర్శులు మడూరి వెంకటేష్,చిక్కుడు శ్రీనివాస్, ముషీర్ ఖాన్ ,సుధీర్ రెడ్డి ,బచ్చన్నపేట్ ప్రధాన కార్యదర్శి కనకయ్య,మహేష్,కనకయ్య నర్సయ్య,ఉప్పలయ్య,నవీన్ ,లలిత ,శేఖర్,కవిత,చంద్రకళ,నిర్మల,నర్సయ్య ,శ్రీనివాస్,కరుణాకర్,తదితరులతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ముతయ్య,కృష్ణమోహన్,విష్ణు,లక్మి, శ్యామ్ మోహన్ రాజు ,కేదారి,సరళ తదితరులు పాల్గొన్నారు