Thursday, 5 November 2026

సీఎం సహాయ నిధి ని సద్వినియోగం చేసుకోవాలి

 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : మండలంలోని మేడారం గ్రామంలో మాధవయ్య, ఏం.ఆశీర్వాదం సోమవారంలో అంజయ్య, దిర్శించర్ల గ్రామంలో పి. నాగమణి ల కు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భందువుగా అదుకుంటుంది అని, అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి నిలుస్తోంది అని, తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల జడ్పిటిసి రాపోలు నరసయ్య, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు అరి బండి సురేష్ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వల్లంశెట్ల రమేష్ బాబు, చిల్లేపల్లి సింగిల్ విండో చైర్మన్ అనంతు శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, పెదపంగా ఎలిషా, మండల పార్టీ యూత్ అధ్యక్షులు నందిపాటి హిందూజ, సోషల్ మీడియా అధ్యక్షుడు పోకల్ కార్ వినోద్, మేడారం ఎంపీటీసీ మండల రాజేష్ , సర్పంచులు సుంకర బోయిన స్వాతి మధు, మాగంటి మాధవి సైదులు, గ్రామ పార్టీ అధ్యక్షులు కటికోల లక్ష్మీనారాయణ, భీమ్ శెట్టి శ్రీనివాస్, కొర్రపిడత సైదులు, మండల కార్మిక విభాగం అధ్యక్షుడు కనకరాజుల రాంబాబు, సీనియర్ నాయకులు ఎండీ రఫిక్, వాడపల్లి సుందర్, పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.