Wednesday, 4 November 2026

సీడ్స్ షాప్ లను తనిఖీ చేసిన అధికారులు

జనంసాక్షి, మంథని : మంథని మండలంలోని విత్తన విక్రయ కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి, పోలీస్ శాఖ వారు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వానాకాలం 2023-24 సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిచేల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇట్టి తనికీలో ప్రత్తి వరి విత్తన నిల్వలు పరిశీలించడం జరిగింది. వ్యాపారస్తులు నాణ్యమైన, అధికారికంగా ధృవీకరించిన విత్తనాలు మాత్రమే అమ్మాలని, స్టాక్ బోర్డ్స్ మెయింటెన్ చేయాలని, రైతులు విత్తనాలు కొన్నప్పుడు బిల్స్ తప్పకుండా ఇవ్వాలని సూచించడం జరిగింది. హెచ్ టి కాటన్ అమ్మిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు నాణ్యమైన విత్తనం అందించని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి అనూష, మంథని ఎస్ఐలు వెంకటేశ్వర్లువెంకటేశ్వర్, రాణి వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.