Wednesday, 4 November 2026

ఆహ్లదం పంచేలా అభివృద్ది పనులు – జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ ప్రజలకు ఆహ్లదం పంచేలా అభివృధ్ది పనులు జరుగుతున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని సుందరీకరణలో బాగంగా పట్ణణంలో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన పరిశీలిస్తూ బుల్లెట్‌ బండిపై విస్తృత పర్యటన చేపట్టారు. మున్సిపల్‌ పరిధిలోని రావులచెరువుకట్ట, తమ్మిచెరువు కట్ట, బొక్కలవాగు కట్ట సుందరీకరణలో బాగంగా జరుగుతున్న సీసీ రోడ్డు, వాకింగ్‌ ట్రాక్‌, లైటింగ్‌ పనులతో పాటు రజకవాడ నుంచి రావులచెరువుకట్ట ప్రాంతంలోని శివకిరణ్‌ గార్డెన్‌ వరకు రహాదారి నిర్మాణం కోసం ఆయన పరిశీలన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోనే మంథని మున్సిపాలిటిని అభివృద్ది చేసి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణానికి చెందిన వారు ఎంతో మంది ఇతర ప్రాంతాల్లో ఉంటారని, అలాంటి వారు మంథనికి వస్తే మంచి ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామన్నారు. మంథనిని మరో కోనసీమ తరహాలో అభివృధ్ది చేయాలనే ఆకాంక్షతో ఉన్నామని, ఈ క్రమంలో అనేక అభివృధ్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. త్వరలోనే మంథని ముఖచిత్రంలోనే మార్పు కన్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.