సీనియర్ జర్నలిస్ట్ ములక మురళి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం వ్యక్తం చేసిన నర్సంపేట డివిజన్ పరిధిలోని జర్నలిస్టులు
జనం సాక్షి, నర్సంపేట
నర్సంపేట డివిజన్ ఈటీవీ సీనియర్ జర్నలిస్ట్ ములక మురళి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం వ్యక్తం చేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్టులు. మురళి గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతూ కుటుంబాన్నీ పోషిస్తున్నారు. 2008 నుంచి నర్సంపేట డివిజన్ ఈటీవీ రిపోర్టర్ గా బాధ్యతలు చేపట్టి వివాద రహితమైనటువంటి స్వభావంతో తన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు.ఒక జర్నలిస్టుగా సమాజంలోని సమస్యలను వెలుగులోకి తెస్తూ తన కుటుంబ పోషణ కోసం అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడ్డారు. వృత్తి బాధ్యతల్లో మునిగితేలుతూ చిన్న వయసులోనే రెండు కిడ్నీలు పాడై గత ఆరేన్లుగా అనారోగ్యంతో పోరాడుతూ నిన్న రాత్రి మృత్యువాత పడడం అందరినీ కలిచివేసింది. దీనితో నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మురళి స్వగ్రామమైన దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మురళి మృతికి సంతాపంగా నర్సంపేట పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మురళి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.





