మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ కొండమల్లేపల్లి అక్టోబర్ 29 జనం సాక్షి: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మునుగోడు ఉప ఎన్నికలల్లో భాగంగా మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రివర్యులు ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, గోషామహల్ కాంగ్రెస్ ఇంచార్జ్ తివారి, మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జైపాల్ నాయక్ లతో కలిసి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ భీల్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ఇంటింటి ఎన్నికల విసృత ప్రచారంలో నిర్వహించారు ఈసందర్భంగా కేతావత్ బీల్యా నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్ర మొత్తం ఉంటుందని రాబోయే ఎన్నికలకు మునుగోడు విజయమే నాంది పలకాలని టిఆర్ఎస్, బిజెపి ప్రలోభాలు ప్రజలకు వివరించాలని చివరి వరకు రైతుల, ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించాలని పిలుపునిచ్చారు టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ఉప ఎన్నికలలో వాడుకుంటున్నారని ఒక్క మహిళను ఓడించడానికి ప్రభుత్వ ఖజానాను గండి కొడుతున్నారు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం అందించాలని కోరారు టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం మొత్తం ఒక నాటకమని రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకొని ప్రజలను, మునుగోడు ఓటర్లను తప్పుద్రోవ పట్టిస్తున్నారు అన్నారు మునుగోడు నియోజకవర్గం లో అధికార టీఆర్ఎస్ గతంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని, చర్లగూడం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా,, రైతులు, భూ నిర్వాసితులు ధర్నాలు చేసిన అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదని విమర్శించారు మునుగోడు నియోజకవర్గం లో రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయని, రైతులకు రుణ మాఫీ కాలేదని, విద్యార్థినీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చాలా కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ రాక మూత పడ్డాయాని తెలిపారు టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని నిత్వవసరాల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో జాతీయ ప్రాజెక్టులు నిర్మించిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు లోనే వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ గెలువు చారిత్రక అవసరం అని ప్రజలు, రైతన్నలు సుఖంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలిపారు కేతావత్ బిల్యా నాయక్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు,రైతులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, యువకులు భారీ సంఖ్యలో స్వాగతం పలికి హారతులు ఇచ్చారు
మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు




