సీపీఎం మహాసభలకు జిల్లా నేతలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఆదివారం నుంచి హైదారాబాద్‌లో జరుగనున్న సిపిఎం మహాసభలకు జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వెళతున్నారు. నాలుగు రోజుల సభకు జిల్లా నుంచి అనేకమంది సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి  నాయకత్వంలో బయలుదేరుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి వాటిని ఎండగట్టేందుకు అనుసారించాల్సిన భవిష్యత్తుకార్యచరణను సిద్ధం చేసేందుకు ప్రత్యేకరాష్ట్రంలో తొలి మహాసభలను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. మధ్యాహ్నం 2గంటలకు పార్టీశ్రేణులతో సుందరయ్యవ్‌చ్ఞిజన కేంద్రం నుంచి నిజాం కళాశాల మైదానం వరకు ర్యాలీ ఉంటుందన్నారు.4 గంటలకు అక్కడి మైదానంలో నిర్వహించే బహిరంగసభకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరీ, బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సాయుధపోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం ముఖ్యవక్తలుగా హాజరవుతారన్నారు.