సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం
నల్లగొండ,(జనంసాక్షి):సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు యాదగిరిగుట్లలో ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాన్ని అంగీకరించమని తెలిపారు. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూడిన కూటమి అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్ర అవసరాలు తీర్చాకే ఇతర రాష్ట్రాలకు గ్యాస్ తరలించాలని సురవరం డిమాండ్ చేశారు.