రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నగదు నింపే కాంట్రాక్టర్ శ్రీనివాస్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని వద్ద నుంచి రూ. 7కోట్లకు పైగా నగదు దోచుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు.




