Monday, 2 November 2026

సీపీ అనురాగ్‌ శర్మ క్షమాపణలు చెప్పారు: నారాయణ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ క్షమాపణలు చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ… ఘటనపై చింతించిన కమిషనర్‌ మున్ముందు ఇలాంటివి పునారావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తొలుత నారాయణ నేతృత్వంలో సీపీఐ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు మగ్ధుం భవన్‌ నుంచి కమిషనర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.కమిషనరేట్‌ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ చేశారు. నారాయణ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అనురాగ్‌ శర్మకు వినతిపత్రం సమర్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *