సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డైరెక్టర్‌తోపాటు గతంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.