హైదరాబాద్: ల్యాంకో, జీఎంఆర్ సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తున్న గ్యాస్ సరఫరాను వేంటనే నిలిపివేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన ఈఆర్‌సీ కార్యాలయంలో కమిషన్ జరిపిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు. ల్యాంకో, జీఎంఆర్‌లకు నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం ధరలు చెల్లిస్తుండటంతో ప్రజలపై రూ. 3వేల కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన విమర్శించారు. బొగ్గు కోనుగోళ్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఒక్కోటన్నుకు రూ. 2,500 అదనంగా చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ప్రభుత్వం బొగ్గు కొనుగోళ్లను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు, మరోసారి రూ.90కోట్ల సర్‌ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పుడు బహిరంగ విచారణ చేస్తుందని ఆయన తెలియజేశారు.




