శంకర్రావు కుమార్తె సుస్మితా
హైదరాబాద్: తన తండ్రి శంకర్రావు పట్ల పోలీసులు అనుసరించిన వ్యవహారం పై ప్రభుత్వం నియమించిన సీఐడీపై తమకు విశ్వాసం లేదని సీబీఐతో విచారణ జరిపించాలని శంకర్రావు కుమార్తె డిమాండ్ చేశారు. ఉదయం విచారణ జరుపుతున్న పోలీసులు సాయంత్రం తన తండ్రిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే వుందని ఆమె వెల్లడించారు.




