Tuesday, 3 November 2026

సీ బ్లాక్‌లో 11 సార్లు కరెంట్‌ కట్‌!

హైదరాబాద్‌ : సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విధులు నిర్వహించే సచావాలయంలోని సీ బ్లాక్‌కూ కరెంటు కష్టాలు తప్పలేదు. సోమవారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో 11 సార్లు కరెంట్‌ సరఫరా ఆగిపోయి మళ్లీ వచ్చింది. ఇదేదో ఆట తీరుగా జరగడంతో సీ బ్లాక్‌లో విధులు నిర్వహించే ఉన్నతాధికారులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. పదకొండోసారి ఏకంగా పది నిమిషాల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులు చాంబర్స్‌ సహా మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నిర్వహణ లోపం కారణంగానే విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *