జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని హనుమాన్ నగర్ కమ్మరివాడకు చెందిన నూతి కృష్ణమూర్తి అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించిగా స్థానిక ప్రజల ద్వారా సమాచారం తెలుసుకున్న కమాన్ పూర్ మండల ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు బోనాల వెంకటస్వామి తమ వంతు సాయంగా సుందరం ఫౌండేషన్ తరుపున 25 కిలోల బియ్యం అందజేసి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ కమ్మగోని అనిల్, నగునూరి నర్సయ్య, తాటికొండ లింగచారి, చెన్నోజు చంద్రశేఖర్, తాటికొండ రమేష్, నూతి భాను, చెన్నూరి అన్వేష్, పాశం సంజయ్, క్యాప్, డిక్కీ శ్రీహర్ష మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీద వారికి ఏ ఆపద వచ్చిన తమ సంస్థ ఎన్నో రకాలుగా ఇప్పటివరకు అన్ని విధాల సాయం చేసిందని ముందు ముందు ఇంకా తమకు సాధ్యమైన మేరకు సాయం చేస్తూనే ఉంటామని బోనాల వెంకటస్వామి తెలిపారు.
సుందరం ఫౌండేషన్ చేయూత




