మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 9
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్కాజిగిరి లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో డిప్యూటీ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీసీ లోన్ లక్ష రూపాయల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బీసీ లోన్ లక్ష రూపాయల లబ్ధిదారులకు ఎల్వోసీ తత్రాలను అందజేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, ఆసరా పెన్షన్,ముఖ్యమంత్రి సహాయనిధి, దళిత బంధు లబ్ధిదారులకు ఎల్వోసి పత్రాలను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందని ఇల్లే లేదని,అన్ని వర్గాలకు అండగా ఉండి నేడు చేతివృత్తులు చేసుకునే 16 కులాల వారికి లక్ష రూపాయలు అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అర్హులైన వారందరూ క్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి,డిఆర్డిఏ యాదయ్య, బీసీ లోన్ అధికారి పాండు,ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి స్వాతి,పిఓ మల్లికార్జున్, బిఆర్ఎస్ నాయకులు సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్,రాముయాదవ్,ఉపేందర్ రెడ్డి,రాందాస్,సూరి,బాలకృష్ణ గుప్తా, మంద భాస్కర్,ఫరీద్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో వైభవంగా దశాబ్ది ఉత్సవాలు.




