Wednesday, 4 November 2026

సుందర ట్యాంక్ బండ్ కి ఆధ్యాత్మిక శోభసుందర ట్యాంక్ బండ్ కి ఆధ్యాత్మిక శోభ 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట పట్టణానికి మణిహారంగా ఉన్న సద్దుల చెరువుకి ప్రస్తుతం  ఉన్న పర్యాటక శోభకు  తోడుగా ఆధ్యాత్మిక శోభ జత కానుంది.సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ పై కొలువై ఉన్న కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.వందలాది మంది సభ్యులుగా ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరిక మేరకు సొంత నిధులతో కట్ట మైసమ్మ ఆలయ నిర్మాణానికి మంత్రి  శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి  దయతో సద్దుల చెరువుతో  పాటు క్రింద ఉన్న అనేక చెరువులు పెద్ద ఎత్తున నిండడంతో ప్రజలు, రైతులు , మత్స్యకారులు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు.ఎల్లప్పుడూ అమ్మవారి దీవెనలు ప్రజలపై ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధి మరింత జరిగేలా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు.వచ్చే బోనాల పండుగ నాటికి అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ్ల అన్నపూర్ణ , జిల్లాగ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్  వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్, వార్డ్ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్, మత్స్య  పారిశ్రామిక  సహకార సంఘం గౌరవ అధ్యక్షులు ఆకుల లవకుశ, చైర్మన్ కోటయ్య, ఉపాధ్యక్షులు నల్లమేకల వెంకన్న, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సురేష్, డైరెక్టర్లు నిరంజన్, జానకీరాములు, లక్ష్మమ్మ, ముత్తమ్మ  తదితరులు పాల్గొన్నారు.