Wednesday, 4 November 2026

భైంసా ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్..

.!భైంసా ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్…!
భైంసా రూరల్ మార్చ్ 25 జనం సాక్షి

– సెంట్రల్ టీమ్ పర్యవేక్షణ అధికారుల రాకతో పరిశుభ్రంగా కనిపిస్తున్న వైనం.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి శనివారం మరింత పరిశుభ్రంగా కనిపిస్తుంది. ఇదేంటి ఇలా ఇంత పరిశుభ్రంగా కనిపిస్తుందని స్థానిక ప్రజలకు చర్చించుకోగా… సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యా టీం అధికారులు శుక్రవారం శనివారం ఆస్పత్రిని సందర్శించే కార్యక్రమం ఉండగా ఇలా పరిశుభ్రంగా తయారైందని తెలుస్తుంది. డెలివరీ వార్డ్ రూంలలో కర్టెన్స్ , కొత్త డస్ట్ బిన్స్ , సెక్యూరిటీ గార్డ్స్ కి యూనిఫామ్ పూర్తి మొత్తంలో పరిశుభ్రత పాటించడం వంటివి కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.