సుబ్బారావు కు జాతీయ అవార్డు!. డి.వి.సుబ్బారావుకు ప్రజాసంబంధాల జాతీయ విశిష్ట సేవ అవార్డ్. (ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టూ పిఆర్ఎస్ఐ -2022 అవార్డు )
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఆర్ఎస్ఐ) ప్రతి సంవత్సరం ప్రదానం చేసే వివిధ అవార్డులలో మొదటిసారి ప్రకటించిన ప్రజాసంబంధాల జాతీయ విశిష్ట సేవ అవార్డు డి.వి.సుబ్బారావుకు లభించింది. భోపాల్లో జరిగిన 44వ అఖిల భారత ప్రజాసంబంధాల సదస్సులో మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ ఈ అవార్డును మంగళవారంనాడు డి.వి.సుబ్బారావుకు ప్రదానం చేశారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టరులో జీవితకాల సభ్యుడుగా ఉన్న సుబ్బారావు గత 33 సంవత్సరాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ప్రజా సంబంధాల సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నారు, అనేక వర్కషాపులు ట్రైనింగ్ ప్రోగ్రాముల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు. గతంలోకూడా మూడుసార్లు వరసగా 2012,13,14 సంవత్సరాలకుగాను జాతీయ ఉత్తమ కార్యదర్శి అవార్డు అందుకున్నారు.
సింగరేణి ప్రజాసంబంధాలశాఖలో పీఆర్ఏ పనిచేసి 2016లో పదవి విరమణ చేశారు. సింగరేణి ప్రజా సంబంధాల విభాగాభివృద్ధిలో ప్రాధానభూమిక పోషించిన సుబ్బారావు సింగరేణి కమ్మునికేషన్ అధికారులకు, కోఆర్డినేటర్స్ కోసం పీఆర్ఎస్ఐ ద్వారా మూడుసార్లు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పీఆర్ఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ స్థానికంగా ఇచ్చే అనేక అవార్డులు సింగరేణికి లభించడంలో తనవంతుగా సింగరేణికి సేవలను అందించారు. సుబ్బారావుకు ఈ అవార్డు రావడంపట్ల సింగరేణి డైరెక్టర్ యస్.చంద్రశేఖర్, మాజీ డైరెక్ట్ దత్తాత్రేయులు, మాజీ ఈడిపిఆర్ & ప్రస్తుత డైరెక్టర్(ఫైనాన్స్) టిజెన్కో డా.టి.ఆర్.కె.రావు,సీనియర్ జర్నలిస్ట్ ఎండి.మునీర్,పలువురు సింగరేణి అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు. తనను ఈ అవార్డు ఎంపికచేసి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) జాతీయ అధ్యక్షుడు డా. అజిత్ పాఠక్ కు సుబ్బారావు కృతజ్ఞతలు తెలియజేసారు…………….జనం సాక్షి
సుబ్బారావు కు జాతీయ అవార్డు




