Tuesday, 3 November 2026

సురవరం వాల్‌ పోస్టుర్ల సంఘటనలో మావోయిస్టులకు సంబంధంలేదు

మహదేవ్‌పూర్‌ : మండలం లోని సురవరం గ్రామంలో వాల్‌ పోస్టర్లు వేసిన సంఘటనలో మావోయిస్టులకు ఎలాంటి సంబంధంలేదని కరీంనగర్‌ ఓఎస్టీ సుబ్బారాయుడు తెలిపారు. మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ కేవలం వ్యక్తిగత కక్షలతో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సంచలనం సృష్టించడానికి అదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్‌ చల్లా రాజయ్య వాల్‌పోస్టర్లు వేశాడని తెలిపారు. ఆయనను అరెస్టు వేశారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన సీఐ రాములు, ఎస్‌ఐ రాజేశ్వరరావు, కాని స్టేబుళ్లను ఆయన అభినందించారు. మారుమూల ప్రాంతంలో అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *