Wednesday, 4 November 2026

సులానగర్ లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

టేకులపల్లి,జనవరి 26( జనం సాక్షి ): 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో మండల వైద్యాధికారి డాక్టర్ దినేష్, సులానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అజ్మీర బుజ్జి, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ కార్యాలయంలో సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ దినేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక ఆరోగ్య కార్యక్రమాలలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ఉత్తమ లక్ష్యాలను సాధించిందని, ఇకముందు కూడా మరింత శ్రమించి ఆరోగ్య సేవలు ప్రజలకు అందజేయడంలో ముందు ఉందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు వైద్యాధికారులు పావని,శ్రావణి,పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్,నాగు బండి వెంకటేశ్వర్లు,వీసం శకుంతల, గుజ్జా విజయ, మంగీలాల్, అక్బర్, ధర్మపురి రవికుమార్,ఫాతిమా, రాంబాబు,కృష్ణయ్య,వైద్య సిబ్బంది, సులానగర్ పంచాయతీ కార్యదర్శి పవిత్ర, ఎక్స్ రోడ్ పంచాయతి కార్యదర్శి శ్వేత, ఉప సర్పంచులు ఉండేటి బసవయ్య, చేతుల భద్రయ్య, పంచాయతీల పాలకమండలి గ్రామస్తులు పాల్గొన్నారు.