Tuesday, 3 November 2026

సూర్యపేట న్యాయమూర్తి బదిలీ

సూర్యపేట లీగల్‌, జనంసాక్షి: నల్గొండ జిల్లా భూ సంస్కరణల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌, సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు వరంగల్‌ జిల్లా ఒకటో అదనపు జిల్లా ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న సి.విజయసారధి ఆచార్యులును ఈయన స్థానంలో నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌. భజరంగబాబును మహబూబ్‌నగర్‌ జిల్లా ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తి భజరంగబాబు తన బాధ్యతలను నల్గొండ కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తికి వెంటనే అప్పగించి, తన కొత్త స్థానానికి వెళ్లాలని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *