Thursday, 5 November 2026

సూర్య నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కొండమల్లేపల్లి సిఐ రవీందర్, ఎస్ఐ నారాయణ రెడ్డి

 కొండమల్లేపల్లి జనవరి 21 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం నాడు కొండమల్లేపల్లి సిఐ రవీందర్, ఎస్ఐ నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో సూర్య 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు సూర్య క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని, సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పత్రికలకు స్వేచ్ఛ చాలా ముఖ్యమని, వివిధ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు, పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు ఎవరికి భయపడకుండా నిర్భయంగా, నిస్సంకోచంగా, వార్తలు రాసి నిజ నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు ప్రజలందరి ఆదరాభిమానాలతో పత్రికా రంగంలో నూతన ఒరవడితో అనధికాలంలోనే విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే పత్రికల్లో సూర్యా పత్రిక ఒకటి అని తెలిపారు సూర్య పత్రిక యజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్య పత్రిక సీనియర్ రిపోర్టర్ మరియు కొండమల్లేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యం. శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, గుమ్మడపల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, కొత్త బావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్, చిన్న అడిశర్లపల్లి సర్పంచ్ గడ్డం శ్రీరాములు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ అశోక్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ బూడిద శ్రీనివాస్ యాదవ్, జనంసాక్షి రిపోర్టర్ ఖాజా మొహినుద్దీన్ మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, సముద్రాల కిరణ్ కుమార్, ఆలంపల్లి విజయ్, బూడిద మల్లేష్ యాదవ్, కుందారపు సాయికుమార్, సూధనబోయిన ధనుంజయ, పిల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు