సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
అశ్వరావుపేట ఆర్సి డిసెంబర్ 21 (జనంసాక్షి)
అశ్వరావుపేట లో రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 30 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ తదనంతరం అదే వేదిక వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం నాడు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు పాల్గొన్నారు. అత్యంత ప్రాధాన్యతగా ఏసుక్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ కార్యక్రమంలో క్రైస్తవులకు ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఏసుక్రీస్తు పుట్టినరోజు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చల్ల ప్రసాద్, జడ్పిటిసి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, బి ఆర్ఎస్ పార్టీ అశ్వరావుపేట మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు, కన్వీనర్ బండి పుల్లారావు, సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.




