సోమాజిగూడ: సంప్రదాయానికి సాంకేతికను జో డించారు. అందుబాటులో ఉన్న విద్యుత్ పరికరాలతో విద్యార్ధినులు రాఖీలను అందంగా తీర్చిదిద్దారు. రక్షాబంధన్ సందర్భంగా బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో ఎలక్ర్టానిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘లెర్న్ అండ్ గివ్’ పేరుతో ప్రత్యేక వర్క్‌షాప్ జరిగింది. నగరానికి చెందిన పీజీపీ ఎలక్ర్టానిక్స్ సహకారంతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ వర్క్‌షాప్‌ను ప్రిన్సిపల్ క్రిస్టీన్ ఫెర్నాండెజ్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న ఎలకా్ట్రనిక్ పరికరాలతో రాఖీలను రూ పొందించడం అభినందనీయమన్నారు. సందర్భాలను బట్టి తమ విద్యార్థినులు పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని వీటికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆ యా రంగాల్లో ఆసక్తిని బట్టి విద్యార్థినులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఈ వర్క్‌షాప్ లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా రకరకాల ఆకృతులలో ఈ-రాఖీల ను తయారు చేసి ఆకట్టుకున్నారు. ఉత్తమ రాఖీలు తయారు చేసిన విద్యార్థినులకు బ హుమతులిచ్చారు




