హైదరాబాద్: సెల్‌ఫోన్‌ను చోరీ చేసి పారిపోతున్న దొంగను ఓ కానిస్టేబుల్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన ఘటన నగరంలోని మైత్రీవనం దగ్గర చోటుచేసుకుంది. ఓ యువతి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా పక్కనే కాపుకాసిన ఓ దొంగ ఆమె చేతుల్లోంచి లాఘవంగా లాక్కుని పారిపోయాడు. బాధిత మహిళ అరవడంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ గమనించి పారిపోతున్న దొంగను ఛేజ్‌చేసి పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు.




