Thursday, 5 November 2026

సెల్ ఫోన్ పోతే కంగారు పడకండి… సి.ఈ.ఐ.ఆర్ వెబ్సైట్లో నమోదు చేయండిసెల్ ఫోన్ పోతే కంగారు పడకండి… సి.ఈ.ఐ.ఆర్ వెబ్సైట్లో నమోదు చేయండి- జిల్లా ఎస్పీ శ్రీ. యం. రమణ కుమార్ 

 

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  మే 17 :- పోయిన సెల్ ఫోన్ లను  CEIR అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి భాదితులకు అందజేత సంగారెడ్డి జిల్లా, BDL-భానూర్ వాస్తవ్యుడు గోశాయి రమేష్ గత నెలలో పటాన్ చెరు నుండి తన స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. నూతన CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) గురించి అవగాహన కలిగి మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ చేసి, BDL-భానూర్ పోలీస్ స్టేషన్ లో ధరఖాస్తు చేయగా వారు CEIR అప్లికేషన్ సహకారంతో పోయిన సెల్ ఫోన్ ను రికవరీ  అందించడం జరిగిందాని sp రమణ కుమార్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం, పోసానిపేట గ్రామ వాస్తవ్యుడు చెట్టుకింది మహిపాల్ గత సంవత్సరం సంగారెడ్డి బస్ స్టాప్ లో తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. నూతనంగా వచ్చిన CEIR గురించి అవగాహన కలిగి మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ చేసి, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేయగా వారు CEIR అప్లికేషన్ సహకారంతో పోయిన సెల్ ఫోన్ ను రికవరీ చేసి సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి సెల్ ఫోన్ ను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ప్రవేశపెట్టన CEIR ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడినా నేరుగా CEIR వెబ్ సైట్ లో లాగిన్ అయి రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ చేయడం ద్వారా ఆ మొబైల్ పని చేయదని, ఎలాంటి సిమ్ వేసిన వెంటనే అలర్ట్ రావడం జరుగుతుందని తద్వారా పోయిన మొబైల్ గుర్తించడం సులభమౌతుందన్నారు.       అందుకొరకు ఎవరైతే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు మొదటగా అదే నెంబర్ తో కొత్త సిమ్ తీసుకొని, మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. తదుపరి www.ceir.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి, అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ క్లిక్ చేసి, పోయిన చరవాణి లోని నెంబర్ (OTP కోసం), ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు మరియు మీ సేవ అప్లికేషన్ నెంబర్ మరియు సర్టిఫికేట్ అప్లోడ్ చేసి, మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ వివరాలు, చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి నమోదు చేయాలి తద్వారా మొబైల్ బ్లాక్ అవుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత తమ పరిధిలోని పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలి. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. నెల రోజుల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో CEIR అప్లికేషన్ సహకారంతో 50 కు పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.