జనం సాక్షి (నర్సంపేట)నర్సంపేట మండలంలోని నరసింగాపురంలో విద్యుత్ అధికారులు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ఒక్కొక్కరికి 49 వేల రూపాయల జరిమానా విధించి రైతులను ఇబ్బందులు గుర్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
బుధవారం మండలంలోని నర్సింగాపూర్ లో రైతు బాధితుల్లో ఎంపీటీసీ భూక్య వీరన్న తమ గోడును విలేకరుల ముందు వెల్లడించారు. విద్యుత్ అధికారులు ఆ గ్రామంలో 39 మంది కేసు నమోదు చేసి నోటీసులు పంపించి భయాన్ని సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. రైతందానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా అక్రమ కనెక్షన్ల పేరిట విద్యుత్ అధికారులు కేసును నమోదు చేసి జరిమానా పేరిట తమను వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు వెంటనే అధికారులు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు.




