Thursday, 5 November 2026

సేవా గుణానికి పెట్టింది పేరు ద్యాప నిఖిల్ రెడ్డి

సేవా గుణానికి పెట్టింది పేరు ద్యాప నిఖిల్ రెడ్డి
— మండల కాంగ్రెస్ నాయకులు అయ్యుబ్ పాష.
ఊరుకొండ, అక్టోబర్ 28 (జనంసాక్షి):
ఊరుకొండ, మిడ్జిల్ మండలాల్లో ఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలు అందించి సేవా గుణాన్ని చాటుతున్న గొప్ప నాయకుడు మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అని మండల కాంగ్రెస్ నాయకులు అయ్యుబ్ పాష అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన చర్లపల్లి వెంకటమ్మ,బాలయ్య దంపతుల కూతురు మమత(22) వివాహానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి .. నిఖిలన్న యువసేన పేరిట రూ.5116/- పెళ్లి కానుక అందజేయడం జరిగింది. ఈ నగదును మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు బత్తుల నాగయ్య, ఎర్రోళ్ల పరుషరాములు, భీమయ్య, బాలయ్య, దాసు నవ దంపతులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మాట్లాడుతూ.. ఊర్కొండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా యుద్ధ ప్రతిపాధికన ఎల్లవేళలా
నేనున్నా అంటూ పెద్ద కొడుకులా ఆర్థిక సహయాలు చేస్తూనే, పేదింటి ఆడ బిడ్డల వివాహానికి పెద్దన్నలా పెళ్లి కానుకలు అందజేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారని గుర్తు చేశారు. మండలంలో సేవాగుణానికి ద్యాప నిఖిల్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.