హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ షట్లర్ సైనా నెహ్వాల్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ కు చేరడం ద్వారా సైనా చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో ఏ మహిళా సాధించని ఘనత సాధించి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సైనా నెహ్వాల్ ఫైనల్ లో ఓడినప్పటికి చక్కటి ఆటతీరు కనబర్చారని సీఎం కేసీఆర్ కొనియాడారు.
సైనాకు సీఎం కేసీఆర్ అభినందనలు




