Wednesday, 4 November 2026

ఈదురు గాలులకు నేలకూలిన అరటి

కళ్యాణదుర్గం, మార్చి 8 : అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంనరసాపురంలో శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు అర టిపంట నేలకూలి సుమారు రూ.3 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. నరసాపురం గ్రామానికి చెందిన సు మారు 15ఎకరాల్లో అరటిపంటను సాగుచేశారు.
వెయ్యికిపైగా చేతికి వచ్చిన అరటిచెట్లు నేలకూలాయని బాధిత రైతులు తెలిపారు. ప్రకృతి కన్నెర్ర చేసి తమను అప్పుల ఊబిలోకి నెట్టిందని కన్నీరు మున్నీరయ్యారు. అరటిపంటను కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *