సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.శాస్త్రవేత్తల ఆవిష్కరణలతో రూపొందించిన సైన్స్ క్యాలెండర్ ను కలెక్టరేట్ లో ఆవిష్కరించి మాట్లాడారు.శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలందరికీ చేరువ చేసేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.పాఠశాల విద్యార్థుల్లో కూడా సృజనాత్మక
ఆలోచనలు పెంపొందించే విధంగా వివిధ సైన్స్ కార్యక్రమాలను రూపొందించాలని,ఆ దిశగా ప్రణాళికలను రచించి ముందుకు సాగాలని సూచించారు.అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ వారికి ఉజ్వల భవిష్యత్ ను అందించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తల ఫోటోలు, ఆవిష్కరణలతో పాటు విజ్ఞాన శాస్త్ర పరిశోధన ఫలితాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాలతో కూర్పు చేయబడిన ఈ క్యాలెండర్ ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలకు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శంకర్ , జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు జాఫర్, జిల్లా ఉర్దూ ఆఫీసర్ కుమారి రుక్సార్ సుల్తానా , మైనారిటీ సంక్షేమ శాఖ గిరి, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ




