జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 2
పెంట్లవెల్లి మండలం లో సైబర్ క్రైమ్ నేరలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు పెంట్లవెల్లి ఎస్సై రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు లైసెన్సు ఇన్సూరెన్స్ హెల్మెట్ నెంబర్ ప్లేట్ ఉండాలి అన్నారు సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆన్ లైన్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఎక్కడ చుసిన ఆన్ లైన్ నేరగాళ్లు పెరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలి అన్నారు ఎలాంటి లింక్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్తపడాలని అదే విధంగా బ్యాంకు అధికారులతో పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ కి ప్రజలు స్పందించవద్దని అలాగే గుర్తుతెలియని వ్యక్తులతో ఓటిపిలను పంచుకోవద్దని బహుమతి గెలుచుకున్నారు లాంటి సందేశాలకు కూడా ప్రజలు స్పందించవద్దని తెలియజేశారు సెల్ఫోన్లు అంతర్జాలం ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని ముఖ్యంగా మహిళలు పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు వేధింపులు అధికమవుతున్నాయని పేర్కొన్నారు విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించాలి అన్నారు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడపడం వల్ల ప్రమాదాలకు దారితీస్తుందని రోడ్డు ప్రమాదాలు జరుగుతే ఆ కుటుంబం ఆసరా కోల్పోయి రోడ్డున పడుతున్నారని అతివేగం మద్యం సేవించడం ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రతి ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పక ధరించాలని మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయి.అంతే కాకుండా మైనర్లు వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే తల్లిదండ్రులకు కష్టాలు తప్పవు అన్నారు.బాల్య వివాహాలు మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు హెచ్చరించారు పోలీసులు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.ఎస్సై రామేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ చంద్రయ్య కురుమయ్య మూర్తి మరియు గ్రామస్తులు ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు




