సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం – ఎస్సై వెంకట్ రెడ్డి హుజూర్ నగర్ నవంబర్ 21 (జనం సాక్షి): సైబర్ నేరాలపై విద్యార్థినీ, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని హుజూర్ నగర్ ఎస్సై కె. వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రియదర్శని డిగ్రీ కళాశాల నందు సైబర్ నేరాలపై, షీ టీమ్స్, భరోసా సెంటర్, ఆధ్వర్యంలో మహిళల భద్రతపై పోలీస్ కళాబృందం, ఆట, పాటల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ ఎస్సై కే. వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఓటిపిఫ్రాడ్స్, షీ టీమ్స్ మహిళల భద్రత రక్షణ,100 డైల్, సోషల్ మీడియా, సైబర్ నేరాలు, టోల్ ఫ్రీ నెంబర్ 1930, సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఆటపాటల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట షీ టీం ఇన్చార్జ్ పాండు నాయక్, షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఎల్లారెడ్డి, జాఫర్ , మహిళా కానిస్టేబుల్ సాయిజ్యోతి, భరోసా సిబ్బంది రజిత, నాగమణి, షీ టీమ్స్, శివరాం పోలీస్ సిబ్బంది, శ్రీను, సత్యనారాయణ, అమ్రు నాయక్ , ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రవీందర్, పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి, నాగార్జున, కృష్ణ , గురులింగం తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం – ఎస్సై వెంకట్ రెడ్డి




