Friday, 6 November 2026

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

గంగారం డిసెంబర్ 9 (జనం సాక్షి)
గంగారం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 76 వ జన్మదినోత్సవ సందర్బంగా గంగారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదినం నిర్వహించడం జరిగింది. జడ్పిటిసి ఈసం రామసురేష్ మాట్లాడుతూ. 60 ఏళ్ల తెలంగాణ పోరాటానికి ముగింపు పలికి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ ప్రజలకు మరెన్నో ఆమె సేవలు అవసరమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము అన్నారు అనంతరం ప్రభుత్వ దావకానాల్లో ఉన్నటువంటి పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాధారపు కొమురయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముడిగే పోతయ్య, జాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుండగాని శ్రీధర్ మండల మహిళా అధ్యక్షురాలు నర్సక్క ఉప సర్పంచ్ సారయ్య పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు