Friday, 6 November 2026

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (9): నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 76 వ జన్మదినం సందర్బంగా గోపాల్ పేట్ మండల కేంద్రంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్న ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ పోరాటానికి ముగింపు పలికి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ ది అని ఆయన అన్నారు భారతదేశ ప్రజలకు ఆమె సేవలు అవసరమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొంకివెంకటేష్, మాజీ ఎంపిటిసి బాలయ్య, చాకల్ పల్లి సర్పంచ్ నరహరి, వార్డు సభ్యుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకృష్ణ నాయుడు, పూసల లక్ష్మయ్య, వెంకటేష్, తెలుగు లక్ష్మయ్య, శ్రీరాములు, శ్రీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు