సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొండమల్లేపల్లి డిసెంబర్ 9 జనం సాక్షి న్యూస్ : యువజన కాంగ్రెస్ కొండమల్లేపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు తెలంగాణ తల్లి ,ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శివసేన రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రం లో యువజన కాంగ్రెస్ కొండమల్లేపల్లి ఆధ్వర్యంలో పట్టణంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీమతి సోనియా గాంధీ గారి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించి పార్టీ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ యువకులు బలిదానాలు చేసుకోవద్దని తెలంగాణ యువత కోసం ఆమె విశిష్ట అధికారాన్ని సైతం త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేశ ప్రజలకు ఆమె విలువైన సేవలు అందించాలని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ర్యక్రమంలో
యువజన కాంగ్రెస్ నాయకులు మంగ్య నాయక్, మహేందర్,కార్తీక్ రామవత్ సేవ నాయక్,నాగేంద్ర, రవి ,ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక




