Friday, 6 November 2026

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 9(జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష కనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము,ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు,నాయకులు సలీం,అహ్మద్ పాషా, మణిదీప్, దినేష్, సురేందర్, భాను గౌడ్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.